
Mega Star Chiranjeevi Stylish Look : మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. కాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ క్రేజీ రీమేక్ సినిమాకి టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. ‘గాడ్ ఫాదర్’ (God Father) అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా ఒక మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .
ప్రస్తుతం ఈ మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిరంజీవి తలకు క్యాప్ తో అలాగే చేతిలో గన్ పెట్టుకుని అలా స్టైలిష్ గా కనిపించే సరికి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. పైగా ఈ మోషన్ టీజర్ లో తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అసలుకే మలయాళంలో విజయవంతమైన సినిమా ఇది.
అందుకే, ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. అయితే, ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెగాస్టార్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఫైట్స్ విషయంలో కూడా చిరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
కాగా ప్రస్తుతం షెడ్యూల్ లో మెగాస్టార్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను స్టంట్ మాస్టర్ సిల్వ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ చేశారు చిరు. అయితే, వినాయక్ లాంటి వ్యక్తిని పెట్టుకుంటే బాగుండేది కదా అని అభిమానులు ఫీల్ అయినా . మెగాస్టార్ మాత్రం మోహన్ రాజాను దర్శకుడిగా ఎన్నుకోవడానికి ముఖ్య కారణం స్క్రిప్ట్ లో అతను చేసిన మార్పులే.
ఆ మార్పులు చిరుకి చాలా బాగా నచ్చాయి. అందుకే, మోహన్ రాజా సూపర్ సక్సెస్ లో లేకపోయినా అతనికి పిలిచి మరీ మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
