Homeఅంతర్జాతీయంDonald Trump: ఇరాన్ తో యుద్ధం ముగింపునకు ట్రంప్‌ తంటాలు అన్నీ ఇన్నీ కావు..

Donald Trump: ఇరాన్ తో యుద్ధం ముగింపునకు ట్రంప్‌ తంటాలు అన్నీ ఇన్నీ కావు..

Donald Trump: పశ్చిమాసియాలో శాంతి ఇప్పట్లో నెలకొనే పరిస్థితులు కనిపిచడం లేదు. అనవసరంగా ఆధిప్యతం చాటుకోవడానికి, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ షాక్‌లు ఇస్తోంది. అమెరికా దాడులను తట్టుకుని ప్రతిదాడులతో అమెరికా అనుకూల దేశాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అమెరికా యుద్ధం కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. చమురు ధరలు పెంచింది. అయినా ట్రంప్‌కు యుధ్ధ ఎలా ముగించాలో అర్థం కావడంలేదు. దీంతో ఇరాన్‌ను బెదిరించి శాంతి ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అనేకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించాడు. ఇరాన్‌ నౌకలపై దాడి చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. ఈ ప్రకటన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను అధిక శ్రేణికి తీసుకెళ్లింది.

పరస్పర సీజ్‌లు, తీవ్ర దాడులు..
గత వారంలో అమెరికా ఇరాన్‌ షిప్‌ను స్వాధీనం చేసుకుంది, ఆయుధాలు, ఇంధనం జప్తు చేసింది. ప్రతిగా ఇరాన్‌ అమెరికా రెండు పడవలను సీజ్‌ చేసి మిస్సైల్‌ దాడులు చేసింది. ఇందులో అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను పూర్తిస్థాయిలో యాక్టివ్‌ చేసింది. అమెరికా ఇప్పటికే ఆర్థికంగా భారీ నష్టపోయింది: రెండు యుద్ధవిమానాలు కూలిపోయాయి, గల్ఫ్‌ దేశాల్లోని మూడు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. చమురు ధరలు 20 శాతం పెరిగాయి.

ట్రంప్‌ ద్వంద్వ వైఖరి..
ట్రంప్‌ సీజ్‌ఫైర్‌ ప్రతిపాదించి, పాకిస్తాన్‌ ఒత్తిడితో 10 రోజుల పొడిగించాడు. అదే సమయంలో ‘చర్చల అవసరం లేదు, ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తాము‘ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇరాన్‌ ప్రతీ ప్రకటనకు కౌంటర్‌ ఇస్తూ ‘మీ 10 దాడులకు మా ఒక్క మిస్సైల్‌ చాలు‘ అని స్పందించింది. ఇది ట్రంప్‌ విదేశ విధానాన్ని సవాలు చేస్తోంది.

ఇరాన్‌ ధైర్యం వెనుక కారణాలు..
బలహీన దేశంగా కనిపించినా ఇరాన్‌ అగ్రరాజ్యానికి దీటుగా పోరాడుతోంది. రష్యా, చైనా మద్దతు, అధునాతన మిస్సైల్స్‌ కీలకం. ట్రంప్‌ దాడులు బెదిరిస్తాడు కానీ వాస్తవానికి చేయడు. ఇరాన్‌ ప్రతిదాడి మరింత తీవ్రంగా ఉంటుందనే భయం, అమెరికాలో ఎనర్జీ క్రై సెస్, ఎన్నికల రాజకీయాలు అడ్డుకుంటున్నాయి. ఇది ట్రంప్‌ పరువును దెబ్బతీస్తూ, అతన్ని ’పేపర్‌ టైగర్‌’గా చిత్రిస్తోంది.

హర్మూజ్‌ మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమవుతుంది. అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. చమురు ధరలు పెరుగుతాయి. మరోవైపు ఇరాన్‌ ప్రతిదాడులపై గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయిల్‌ భయపడుతున్నాయి. డీల్‌ కుదిరకపోతే పెద్ద యుద్ధం, అణు ఉద్రిక్తతలు రావచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version