
దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలను దేశం అనుమతించదని అన్నారు. భారత్ అథ్లెట్ల ప్రతిభను ప్రశంసించిన ప్రధాని దేశం కొత్త రికార్డులను సృష్టిస్తున్న సమయంలో కొందరు పార్లమెంట్ సమావేశాలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒకరి పురోగతి కుటుంబ నేపథ్యంపై కాకుండా శ్రమించే తత్వంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.