
కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా నగరంలో నిర్వహిస్తున్న అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. తొలిగంటలో 5వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకేచోట 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్ దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. ఇందుకు హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రం వేదిక అయింది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రులు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.