
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 108.80 అడుగుల వద్ద ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు. ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు నిల్వ ఉంది.