జీవితంలో అందమైన అనుభవం పెళ్లి. ఎంతో ఆడంబరంగా బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుకను జరుపుకుంటారు. అతిరథుల మధ్య సందడి వాతావరణంతో పెళ్లివేడుక అంటే ఎవరికైనా ఇష్టమే. ప్రతీ మనిషి జీవితంలో పెద్ద పండుగ అంటే అది పెళ్లి మాత్రమే. ఈ పెళ్లిలో సరదాలు..కోపాలు.. నృత్యాలు ఇలా అన్ని రకాల సమ్మేళనాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి పెళ్లిలో గొడవలు, చీదరింపులు, వివాదాలు కూడా ఉంటాయి. తాజాగా పెళ్లిలో పెళ్లికూతురుకు తెగ కొపమొచ్చింది. అది ఓ గిప్ట్ చేతిలో పెడితే…ఎవరైనా గిఫ్ట్ ఇస్తే సంతోషిస్తారు. కానీ ఆ పెళ్లి కూతురు మాత్రం దానిని తీసి నేలక కొట్టింది… ఇంతకీ ఏం జరిగింది.
ఠాగూర్ అనే వ్యక్తి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో కింద ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరు లైకులు కొడుతున్నారు.. మరికొందరు డిస్లైక్లు కొడుతున్నారు. చాలా చిన్న నిడివితో ఉన్న ఈ వీడియోలో ఏముందోనని కొత్తగా చూసిన వారు తప్పకుండా పూర్తిగా చూస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే..?
పెళ్లి పూర్తయిన తరువాత వేదికిపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే పెళ్లి కొడుకు స్నేహితులు అక్కడికి వస్తారు. తన స్నేహితుడి పెళ్లి కనుక వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అల్లరి చేస్తూ గోల చేస్తున్నారు. ఇంతలో వారిలో ఒకరు ఓ అట్ట పెట్టె ప్యాక్ చేసిన ఒకదానిని పెళ్లి కూతురుకు ఇస్తాడు. అయితే సాధారణంగా గిఫ్ట్ లను పెళ్లి అయిన తరువాత విప్పి చూసుకుంటారు. కానీ పెళ్లి కూతురు అక్కడే దానిని ఓపెన్ చేసింది.
షాకింగ్..! అలా ప్యాక్ చేసిన దానిలో చిన్న పిల్లాడికి తాగిపించే పాల సీసా ఉంది. దీంతో పెళ్లి కూతురుకు చిర్రెత్తుకొచ్చంది. కోపంతో దానిని అక్కడే నేలకు కొట్టింది. అక్కడున్నవారంతా షాక్. ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని బయటకు ఎలా రిలీజ్ చేశాడో తెలియందు. కానీ ఠాగూర్ అనే వ్యక్తి పేరుమీద అప్లోడ్ అయింది. ఈ సీన్ ను చూసిన వారంతా కొందరు ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు ఆడవారి మనోభావాలను గౌరవించాలని అంటున్నారు.