కోవిడ్ కి వాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలలోని కంపనీలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికా కు చెందిన జూన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసుతో కోవిడ్ నుండి రక్షణ కలిపించే విధంగా వాక్సిన్ ను తయారు చేస్తున్నామని తెలిపింది. ఈ వాక్సిన్ 3వ దశ ప్రయోగాలు బుధవారం నుండి ప్రారంభం కాగా దీనిని అమెరికా, బ్రెజిల్, చీలి, కొలంబియా, అర్జెంటీనా, పెరు,మెక్సికో దేశాలలోని 60వేల మంది వాలంటీర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది. మాములుగా అయితే ఏ వ్యాధినైనా తగ్గించడానికి 2డోసులు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: కరోనా వేళ ఇవి చూసుకొని వాడండి