మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభం నుంచి నిత్యం ఏదో ఒక వార్తతో ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది మూవీగా నిలుస్తూ వస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం సన్నహాలు చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ నిలిచిపోవడంతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి
రాంచరణ్ తాజాగా ట్వీటర్లో ఓ ఫొటోను షేర్ చేశాడు. రఫ్ అండ్ టఫ్ లుక్కుతో.. బారుగడ్డం.. కోరమీసంతో కన్పిస్తున్నాడు. రామరాజు పాత్ర కోసం రాంచరణ్ మేక్ ఓవర్ అయిన తీరు చూస్తుంటే అభిమానులకు గుస్ బంప్స్ రావడం ఖాయంగా కన్పిస్తోంది. నిన్నటి దాకా రాంచరణ్ బాబాయి(పవన్ కల్యాణ్) టీనేజ్ ఫొటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా అబ్బాయ్(రాంచరణ్) పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఆ తర్వాత తనదైన స్టార్డమ్ తో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నాడు. రోజురోజుకు రాంచరణ్ లుక్కులో వెరియేషన్స్ కన్పిస్తున్నాయి. ‘ధృవ’లో స్టైలీష్ గా కన్పించిన రాంచరణ్.. ‘రంగస్థలం’లో ఢిపరెంట్ లుక్కులో కన్పించి అభిమానులను అలరించాడు.
Also Read: బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో నలుగురు స్టార్ హీరోయిన్లకు సమన్లు !
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం బారుగడ్డం.. కోరమీసం పెంచి రామరాజు పాత్రలో ఒదిగిపోయినట్లు కన్పిస్తున్నాడు. ఈ ఫొటో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పటికీ అభిమానులకు గుస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. ఈ ఫొటోకు రాంచరణ్ Be the best possible version of urself అని క్యాప్షన్ జోడించాడు. ఈ క్యాప్షన్ కు తగ్గట్టుగానే పిక్ ఉందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.