
కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు కీలక విషయం వెలుగులోకి తెచ్చారు. వ్యాక్సిన్ కరోనా వైరస్ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.