
యాస్ తుఫాన్ రాష్ట్రం పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. తుఫాన్ ప్రభావితం చేస్తున్నదని అంచనా వేస్తున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుఫాను ముదస్తు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.