ఈస్ట్ జోన్ పరిధిలోని విశాల్ మార్ట్ అంబర్ పేట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను పరిశీలించామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈస్ట్ జోన్ పరిధిలో 25 చెక్ పోస్టులు ఉన్నాయని, జాయింట్ సీపీ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర సిటీలతో పోలిస్తే మన హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. డెత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందన్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్, పర్మిషన్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.