– ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మిల్పిటాస్‌లో వైభవంగా నిర్వహణ
NRI TDP Bay Area అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్) వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు వంద మందికి పైగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అభిమానులు ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను, రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులను, సినీరంగంలో చూపిన ప్రతిభను స్మరించుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న వారంతా ఎన్టీఆర్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా జయంతి సంబరాలను నిర్వహించారు.

కార్యక్రమంలో మాట్లాడిన జయరాం కోమటి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహానాడు ప్రారంభమైన సమయానికే బే ఏరియాలో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. మహానాడు రెండో రోజు మెయిన్ స్క్రీన్‌పై ఎన్నారైల భాగస్వామ్యంపై మాట్లాడనున్నట్లు జయరాం కోమటి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన ఆయన, తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పౌరాణిక పద్యాలను ఆలపిస్తూ సభలోని వారిని అలరించారు. 78 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ప్రముఖ నటి జమునతో కలిసి ‘శ్రీకృష్ణరాయబారం’ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

వేడుకల నిర్వహణలో ఎన్నారై టీడీపీ నాయకుడు వెంకట్ కోగంటి కీలక పాత్ర పోషించారు. చిన్నారుల చేత కేక్ కట్ చేయించి ఎన్టీఆర్ జయంతిని ప్రత్యేకంగా జరిపారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మహానాడును వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావు, శివ దువ్వూరు, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య, రాజశేఖర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితర మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
