
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన నందిగ్రామ్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. వాటిని సురక్షితంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. భాజపా నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ దీదీ జూన్ లో కోల్ కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ షంపా సర్కార్ బుధవారం ఆన్ లైన్ లో విచారణ చేపట్టగా దీదీ హాజరయ్యారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేయనున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.