ముందుగానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ !

మొత్తానికి హాట్ బ్యూటీ ‘దియా మీర్జా’కు ఈ రోజు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే, డెలివరీ డేట్ కన్నా నెల రోజుల ముందే ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఏమిటి అంటూ ఆమె అభిమానులు కంగారుపడుతూ ఏమి జరిగింది అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే భయపడాల్సిన ప్రమాదం ఏమి లేదు. ప్రేగ్నన్సీ కాంప్లికేషన్ కారణంగా దియా మీర్జాకి అర్జెంట్ గా సిజీరియన్ చెయ్యాల్సి వచ్చింది. దియా కడుపులో అపెండిక్స్ సమస్య తలెత్తింది. ఆ కారణంగా దియా మీర్జాకి, […]

Written By: admin, Updated On : July 14, 2021 4:43 pm
Follow us on

మొత్తానికి హాట్ బ్యూటీ ‘దియా మీర్జా’కు ఈ రోజు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే, డెలివరీ డేట్ కన్నా నెల రోజుల ముందే ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఏమిటి అంటూ ఆమె అభిమానులు కంగారుపడుతూ ఏమి జరిగింది అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే భయపడాల్సిన ప్రమాదం ఏమి లేదు. ప్రేగ్నన్సీ కాంప్లికేషన్ కారణంగా దియా మీర్జాకి అర్జెంట్ గా సిజీరియన్ చెయ్యాల్సి వచ్చింది.

దియా కడుపులో అపెండిక్స్ సమస్య తలెత్తింది. ఆ కారణంగా దియా మీర్జాకి, ఆమె బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని, ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి డాక్టర్లు ఇలా అర్జెంట్ గా సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. ప్రస్తుతం దియా మీర్జా, అలాగే ఆమె కొడుకు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాకపోతే ప్రస్తుతానికి దియా కొడుకును నియో నాటల్ కేర్ లోనే ఉంచారు.

ఇక తన ముద్దులు కుమారుడికి ఆవ్యాన్ ఆజాద్ రేఖీ అనే పేరు పెట్టామని దియా మీర్జా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. తన కొడుకు పేరును రివీల్ చేస్తూనే కొడుకు వేలును పట్టుకున్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఏది ఏమైనా 39 ఏళ్ళ దియా మీర్జా పెళ్లికి ముందే గర్భవతి కావడం ఒక విశేషం అయితే, డెలివరీ డేట్ కి నెల ముందే బిడ్డను కనడం మరో విశేషం.

ఇక ఈ ఏడాది వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడింది దియా. దియా ఇటీవల తెలుగులో నాగార్జున సరసన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. అన్నట్టు దియాది హైదరాబాదే. ఆమెకు గతంలో ఒక పెళ్లి అయింది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకుని ఇలా తల్లి అయింది.