https://oktelugu.com/

సెంట్రల్ విస్టా పనులు ఆపే ప్రసక్తే లేదు.. ఢిల్లీ హైకోర్టు

సెంట్ర్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ పనులు నిలిపివేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే కోర్టు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా వేసి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 31, 2021 11:24 am
    Follow us on

    సెంట్ర్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ పనులు నిలిపివేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే కోర్టు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా వేసి పిటిషన్ తప్ప పిల్ కాదని అనడం గమనార్హం.