సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి మద్య దూరం పెరుగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి మెల్లగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు ప్రణాళిక వేసింది ఆయనే అని తెలిసినా ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యాపారాలు, పెట్టుబడులు చూసుకున్నఆయన అనూహ్యంగా కోర్టుల్లో వినిపిస్తున్న వాదనలు, చార్జిషీట్లలో పేర్లు మాయం కావడంతో వైసీపీ నాయకుల్లో కలకలం రేగుతోంది.
ఇటీవల ఈడీ దాఖలు చేసిన తాజా చార్జి షీట్ లో ఏ-2గా విజయసాయిరెడ్డి పేరు లేదు. దీంతో మెల్లగా ఆయన చార్జిషీట్ల నుంచ తప్పుకుంటున్నారని తెలుస్తోంది. కోర్టుల్లో కూడా అవే వాదనలు వినిపిస్తున్నారు. క్విడ్ ప్రోకోల్లో లాభం లేకపోయినా తనను ఇరికిస్తున్నారని వాపో యినట్లు సమాచారం.
సీబీఐ కూడా మొత్తం ఆయనే చేయించారని చెబుతున్నా విజయసాయిరె డ్డి మాత్రం తనకు ఏ సంబంధం లేదని బుకాయిస్తున్నారు. మొత్తం జగనే చేశారన్న కోణంలో తన అభిప్రాయాలు చెబుతున్నారు. జగన్ సైతం అంతా విజయసాయిరె డ్డి చేయించారని చె బుతుండడంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
జగన్ జగత పబ్లికేషన్లలో కొద్ది రోజుల క్రితం కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లలో విచారణలో అసలు ఆ కేసుల్తో తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి చేశారని జగన్ తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు. జగతి పబ్లికేషన్లలో పెట్టుబడులపై దాఖలైన కేసులో మోసపోయామని ఫిర్యాదు చేసిన ముగ్గురు తన పేరును ఎక్కడా చెప్పలేదని, తనకు సంబంధం లేకపోయినందున కేసు నుంచి డిశ్చార్జి చేయాలని జగన్ కోరుతున్నారు. విజయసాయిరెడ్డిని మాత్రమే నిందితుడిగా చూడాలన్నారు.
వైసీపీలో విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డిని మరోవైపు జగన్ దూరం పెడుతున్నారు. ఇంతకాలం అన్ని వ్యవహారాలు చూసినా ప్రస్తుతం సజ్జల చూస్తుండడంతోనే అంతర్గతంగా విజయసాయిరె డ్డిని దూరం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో వారికే తెలియాలి.