తక్కువ ఖర్చుతో ఇమ్యూనిటీ పవర్ పెంచే ఆహార పదార్థాలివే..?

దేశంలో గడిచిన నాలుగు రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలో గడిచిన 24 గంటల్లో లక్షన్నర కరోనా కొత్త కేసులు నమోదయాయి. అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ను జయించడంతో పాటు వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. దేశంలో రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతోనే ఇమ్యూనిటీ పవర్ ను […]

Written By: Navya, Updated On : May 31, 2021 11:19 am
Follow us on

దేశంలో గడిచిన నాలుగు రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలో గడిచిన 24 గంటల్లో లక్షన్నర కరోనా కొత్త కేసులు నమోదయాయి. అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ను జయించడంతో పాటు వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. దేశంలో రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతోనే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కనీసం 100 గ్రాముల ప్రోటీన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. బీన్స్, నల్ల శనగలు, వేరుశనగలు, అలసందలు తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ సులభంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

కాయగూరలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. చుక్కకూర, పాలకూర, గోంగూర, తోటకూరలను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మంచిది. వారంలో రెండు నుంచి మూడు రోజులు తృణధాన్యాలను తీసుకోవాలి. పచ్చిమిర్చి, క్యాప్సికం, పెసలు, అలసందలు, రాజ్మా, పండ్లు, ప్రొబయాట్రిక్స్ తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

నిమ్మకాయ, బాదం, లెమన్ టీ తాగడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ఆకుకూర, పాలు, గుడ్లు, బొప్పాయి పండ్లు, శనగలు, కూరగాయలు ప్రతిరోజూ తీసుకుంటే మంచిది.