
ప్రజలపై ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల కోసమే దళిత బంధు కార్యమాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. తన రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. హుజూరాబాద్ ప్రజలకు ఇచ్చే వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే దళిత బంధు, పింఛను, రేషన్ కార్డులు తీసుకుని ఓటు మాత్రం ఈటలకు వేస్తామని హుజూరాబాద్ ప్రజలు అంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు.