https://oktelugu.com/

Sarkaru Vaari Paata Shooting Updates: మహేష్ పై గోవా యాక్షన్ సీన్స్ అద్భుతమట !

Sarkaru Vaari Paata Shooting Updates: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh Babu) – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata). కాగా దుబాయ్, హైదరాబాద్ షెడ్యూల్స్ తర్వాత రీసెంట్ గా ఈ సినిమాలో కీలక భాగాన్ని షూట్ చేయడానికి ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, నిన్నటితో ఈ గోవా షెడ్యూల్ షూట్ పూర్తి అయింది. ఈ […]

Written By:
  • admin
  • , Updated On : August 25, 2021 / 01:45 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata Shooting Updates: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh Babu) – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata). కాగా దుబాయ్, హైదరాబాద్ షెడ్యూల్స్ తర్వాత రీసెంట్ గా ఈ సినిమాలో కీలక భాగాన్ని షూట్ చేయడానికి ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, నిన్నటితో ఈ గోవా షెడ్యూల్ షూట్ పూర్తి అయింది.

    ఈ షెడ్యూల్ లో మహేష్ అండ్ విలన్స్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అన్నట్టు క్రేజీ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఈ యాక్షన్ పార్ట్ ను కంపోజ్ చేశారు. ఇక ఈ యాక్షన్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా మహేష్ ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.

    సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తాయట. ఇక త్వరలోనే మొదలు పెట్టబోయే షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ఉండనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ఉంటుంది. ఈ షెడ్యూల్ లో లవ్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. కీర్తి సురేష్ ( Keerthy Suresh) – మహేష్ కలయికలో ఈ సీన్స్ వస్తాయట.

    ప్యూర్ రొమాంటిక్ టోన్ లో ఈ సీన్స్ సాగుతాయని, ముఖ్యంగా మహేష్ బాబు – కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా ఈ సీన్స్ లో ఎలివేట్ అవుతుంది అని తెలుస్తోంది. ఎంతైనా పరుశురామ్ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ రాయడంలో దిట్ట. అందుకే ముందు నుంచి ‘సర్కారు వారి పాట’ రొమాంటిక్ ట్రాక్ పై ఇప్పటికే అనేక పుకార్లు వచ్చాయి.

    మొత్తానికి ఇంట్రెస్ట్ తో సాగే రొమాంటిక్ ట్రాక్ లో మహేష్ – కీర్తి జోడీ ఉంటే అదిరిపోతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లోన్లు వసూళ్లు చేసే కంపెనీకి బాస్ గా నటిస్తే.. కీర్తి సురేష్ ఆ కంపెనీ ఓనర్ కూతురు కళావతి పాత్రలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.