https://oktelugu.com/

వడ్డీ రేట్లలో మార్పు లేదు.. ఆర్బీఐ

మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్ బ్యాంకు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించారు. కొవిడ్ కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. ఏప్రిల్ లో జరిగన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగాఉంచిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 4, 2021 10:54 am
    Follow us on

    మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్ బ్యాంకు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించారు. కొవిడ్ కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. ఏప్రిల్ లో జరిగన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగాఉంచిన విషయం తెలిసిందే.