
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రించే యోచనలో ప్రభుత్వం ఉందా అని పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమాధానం ఇచ్చారు. కరోనా పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించడంతో పాటు ఉద్యోగాలను కాపాడడానికి కరెన్సీ నోట్లను మంద్రించాలని ఎంతోమంది ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తోన్న సమయంలో ప్రభుత్వం ఈ క్లారిటీ ఇచ్చింది.