
నేషనల్ ఇన్‌స్ట్రక్షనల్ మీడియా ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 318 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ వొకేషనల్ కన్సల్టెంట్లు, కన్సల్టెంట్ పోస్టులు ఉండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31 ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం.
https://nimi.gov.in/index.htm వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 318 ఉద్యోగ ఖాళీలలో జేసీవీ ఉద్యోగ ఖాళీలు 240 ఉండగా టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలు 48, ఐటీ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంబంధిత స్పెషలైజేషన్ ను బట్టి 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 2021 సంవత్సరం జులై 31వ తేదీ చివరి తేదీగా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు ఉద్యోగాలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భారీ వేతనం పొందే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.