KCR 2025 Roundup : తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పేర్లు చెబితే పారీ‍్ట క్యాడర్‌లో ఒక జోష్, ఉత్సాహం కనిపిస్తుంది. తెలంగాణ అభిమానుల్లో ఒక ఆవేశం తొణికిసలాడుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. తిరుగులేని నాయకుడిగా గురి‍్తంపు తెచ్చుకున్నారు. అయితే 2023 ఎన్నికలనాటికి కేసీఆర్, అతని కుటుంబం అనుసరించిన విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో మూడోసారి గెలవాలన్న కేసీఆర్ ఆకాంక్ష నెలరవేరలేదు. దశాబ్దకాలం తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ గ్రాఫ్ 2023 డిసెంబర్ తర్వాత నుంచి పడిపోతూ వస్తోంది. 2025లో అయితే ఇటు పార్టీ, అటు కుటుంబం, మరోవైపు అనారోగ్య సమస్యలు కేసీఆర్‌ను చుట్టుముట్టాయి. దీంతో దాదాపు ఏడాదికాలం ఆయన ప్రజలో‍్లకి రాలేదు. ప్రతిపక్ష నేతగా ఆశించిన ప్రభావం చూపలేదు. పార్టీలో కలహాలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, సొంత పార్టీపైనే కూతురు ఆరోపణలు.. కేసీఆర్‌పై మరింత ఒత్తిడి పెంచాయి.
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై పోరాటం..
2025 కేసీఆర్‌కు పరీక్షల సంవత్సరంగా మారింది. పార్టీ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కేసీఆర్ పట్టుదలగా పోరాడుతున్నారు. సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లారు. అయితే కేసుల్లో వేగం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక కేసీఆర్ కూతురు, ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేశారు. సొంత నేతలపైనే ఆరోపణలు చేశారు. దీంతో చివరకు కూతురును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కేసీఆర్‌కు వచ్చింది. అయితే కవిత పార్టీని వదిలి, తండ్రి పాలనపై దర్యాప్తు చేస్తానని షాక్ ఇచ్చారు. ఆమె లక్ష్యం వేరైనా, దెబ్బ తగిలేది కేసీఆర్‌కే.
ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తిడి
బీఆర్ఎస్ కార్యకర్తల్లో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళనా గుసగుసలు ఎక్కువ. ఏడాదంతా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే పరిమితం కావడం అనుమానాలకు తావిచ్చింది. అవసర సమయంలో వైద్య పరీక్షలకు వస్తున్నారు. అక్కడి నుంచే పార్టీ ఆదేశాలు జారుతున్నాయి. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించినా, మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో విచారణలు, ఫార్ములా-ఈ రేస్ ఆరోపణలు కుటుంబాన్ని చుట్టుముట్టాయి. ఈ ఒత్తిడులు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పార్టీలో అభిప్రాయం.
అసెంబ్లీకి రాకుండా..
2025-26 బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ తొలిరోజు మాత్రమే కనిపించారు. కొద్ది నిమిషాల పాటే. తర్వాత అసెంబ్లీలో ముఖం చూపలేదు. తాజాగా శీతాకాల సమావేశాల తొలిరోజు మళ్లీ హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి నమస్కారం చేసిన ఆ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం ఐదు నిమిషాలే అసెంబ్లీ హాల్‌లో ఉండి వెళ్లిపోయారు. హాజరు పడేందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రజలకు దూరం..
కేసీఆర్ పార్టీకే కాదు ప్రజలకూ దూరంగా ఉంటున్నారు. జల వివాదాల మధ్య నల్లగొండలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ భారీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ప్రజల ముందు కనిపించలేదు. రెండేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. కానీ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. దీంతో ప్రజల్లోనూ, పార్టీలోనూ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది.
2025 సంవత్సరం బీఆర్ఎస్ రెండు కీలక ఎన్నికలు ఎదుర్కొంది. జూబ్లీహిల్స్ బై-పోల్‌లో మాగుంట గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నిలబెట్టుకోలేదు. ఇక పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొత్తంగా 2025 కేసీఆర్‌కు పరాజయాలే ఎక్కువగా ఎదురయ్యాయి.