
జమ్మూకశ్మీర్ లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్ లో నలుగురు, శ్రీనగర్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్ ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ లో ఇంజెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్బ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) తో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ఎన్ఐఏకు సహకరిస్తున్నాయి. శ్రీనగర్, అనంత్ నాగ్, బారాముల్లా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.