
60 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 117/2 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14, రాస్ టేలర్ 11 పరుగులతో ఎంతో సంయమనంతో ఆడుతున్నారు. భారత పేసర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఓపికతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇషాంత్ వేసిన 60 వ ఓవర్ లో విలియమ్సన్ సింగిల్ తీయగా టేలర్ ఒక బౌండరీ బాదాడు.