‘బాలయ్య బాబు’కు క్రేజ్ తగ్గింది, కారణం బాలయ్య సినిమాకి గట్టిగా నాలుగు కోట్లు కూడా రాలేదు ఆయన గత సినిమాల నుండి. ఇదే పరిస్థితి వరుసగా నాలుగు సినిమాలకు కనిపిచింది. దాంతో బాలయ్య సినిమాలు కొనేవాడే లేకుండా పోయాడు. దాంతో బాలయ్య చుట్టూ డైరెక్టర్లు వెంట పడటం మానేశారు. పైగా 2004 నుండి బాలయ్యతో సినిమా చేయాలని ఏ స్టార్ డైరెక్టర్ తనంతట తానే వచ్చి ప్రయత్నించింది లేదు.
దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య పరువును దారుణంగా తీసేశాయి. మొత్తానికి బాలయ్య బాబుకి ఇక సినిమాలు రావు అని, బాలయ్య పని అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో బోయపాటి ‘అఖండ’ సినిమా టీజర్ వచ్చి బాలయ్య రేంజ్ ను పెంచింది. అందుకే అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా ఇంట్రెస్ట్ చూపించాడు.
వీరి కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయింది కూడా. కానీ, ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే, ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఈ సినిమాని మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఎలాగూ “F3” షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి అవుతుంది.
అంటే, ఆగస్టు మూడో వారం నుండి అనిల్ ఫ్రీ అయిపోతాడు. అందుకే, బాలయ్య సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను మరో ఆరేడు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇదొక పూర్తి వైవిధ్యమైన కథ అట. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.