Megastar Chiranjeevi : మరో 6 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం విడుదల కాబోతుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సనాక్రాంతికి పక్కా పైసా వసూల్ సినిమా అంటే ఇదే అని ట్రేడ్ విశ్లేషకులు సైతం అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కూడా ఈ చిత్రానికి హాట్ కేక్ లాగా జరిగిపోతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పై సోషల్ మీడియా లో తమిళియన్స్ చిన్నగా నెగిటివిటీ ని చూపిస్తున్నారు. అందుకు కారణం ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ గా నటించడం వల్లే.
ఎందుకంటే నయనతార తమిళనాడు లో దాదాపుగా ప్రతీ సూపర్ స్టార్ తో కలిసి నటించింది. కానీ ఒక్కరి మూవీ కి కూడా ఆమె ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆమె వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి నయనతార ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ కోసం ప్రొమోషన్స్ లో పాల్గొనబోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ తమిళియన్స్ సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. అంతే కాకుండా ఆమెని తక్కాలి తొక్కా అంటూ కూడా సంబోధిస్తూ ఎగతాళి చేస్తున్నారు. నయనతార ఇప్పటి వరకు చిరంజీవి తో కలిసి మూడు సినిమాల్లో నటించింది. సైరా నరసింహా రెడ్డి చిత్రం లో చిరంజీవి కి జోడీగా నటించిన నయనతార, ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో చెల్లి గా నటించింది. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో మరోసారి చిరంజీవి కి జోడీ గా నటించింది. ఇలా వీళ్లది సుదీర్ఘ ప్రయాణం కావడం తో, నయనతార చిరంజీవి కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది.
గత ఏడాది ఉపాసన కి జరిగిన రెండవ సీమంతానికి కూడా నయనతార తన భర్త సతీష్ విగ్నేష్, మరియు ఇద్దరు కావలపిల్లలతో కలిసి వచ్చింది. ఇలా గతం లో ఆమె తమిళనాడు లో ఏ హీరో ఈవెంట్ కి వెళ్ళలేదు. అలాంటిది చిరంజీవి కోసం ఏమి చేయడానికైనా రెడీ అంటుంది అంటే, ఆమె ఆ కుటుంబానికి ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, రేపు హైదరాబాద్ లో జరగబోయే ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నయనతార హాజరు కాబోతుంది అట. ఆమె ఏమి మాట్లాడబోతుందో వినాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.