SS Rajamouli’s Varanasi :’వారణాసి'(Varanasi Movie) చిత్రం పై రోజురోజుకి అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటున్నాయి. ఒకే ఒక్క గ్లింప్స్ వీడియో తో ఈ సినిమా పై అంతర్జాతీయ స్థాయిలో హైప్ పెంచేసాడు రాజమౌళి(SS Rajamouli). ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా, సైలెంట్ గా హైదరాబాద్ లో జరిగిపోతూ ఉంది. ఇప్పట్లో ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఆశించలేము కానీ, మహేష్ బాబు(Superstar Mahesh Babu) పుట్టిన రోజు నాడు మాత్రం టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కేవలం #Globetrotter కాన్సెప్ట్ మీదనే కాదు, #Timetrottler కాన్సెప్ట్ మీద కూడా తెరకెక్కుతుంది. అంటే టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ చిత్రం లో మహేష్ బాబు శ్రీ రాముడి క్యారక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. శ్రీరాముడి గెటప్ మీద మహేష్ పై రాజమౌళి కొన్ని షాట్స్ కూడా తెరకెక్కించాడు.
ఆయన మొబైల్ వాల్ పేపర్ కూడా మహేష్ బాబు శ్రీ రాముడు లుక్ తో ఉన్నదే ఉంటుందట. ఈ లుక్ సోషల్ మీడియా లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ, రిలీజ్ అయిన రోజు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ నడుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని 2027 వ సంవత్సరం, ఏప్రిల్ 9 న విడుదల చేయబోతున్నారట. అంటే శ్రీ రామనవమి రోజున రిలీజ్ అన్నమాట. ఈ విడుదల తేదీని మహేష్ బాబు శ్రీ రాముడి లుక్ తో ఉన్న పోస్టర్ తో, ఈ ఏడాది మార్చ్ లో రాబోతున్న శ్రీ రామ నవమి రోజున అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఎప్పుడు మొదలు అవుతాయో, ఎప్పుడు ముగుస్తాయో ఎవరికీ తెలియదు. కనీసం మూడు నుండి నాలుగేళ్ల సమయం తీసుకుంటాడు. కానీ ఈ సినిమాకు అలా లేదు. 2024 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోపు షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. అంటే సరిగ్గా సంవత్సరం రోజుల్లో షూటింగ్ అవ్వబోతుంది అన్నమాట. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ తో కూడుకున్నది కాబట్టి, కేవలం VFX కోసం ఏడాది సమయం తీసుకునేలా ఉన్నారు. ప్రముఖ హాలీవుడ్ VFX కంపెనీలు ఈ చిత్రం కోసం పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు షూట్ చేసిన దాంట్లో 50 శాతం కి పైగా VFX వర్క్ పూర్తి అయ్యిందట. ఈ రేంజ్ స్పీడ్ ఉంటే, ఏప్రిల్ 9న కచ్చితంగా ఈ చిత్రం విడుదల అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.