ప్రతీ హీరో కి , నిర్మాతకు , వాళ్ళ అభిమానులకు కెరీర్ పరంగా కొన్ని అవమానాలు ఎదురు అవుతుంటాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా , ఏదో ఒక సందర్భంలో ఘోరమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవాల్సి వస్తుంది , అది తప్పదు. అలా ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఇటీవల కాలంలో ఒక మాయని మచ్చ లాగా , ఆయన అభిమానులకు పీడకల లాగా మిగిలిపోయిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిలిమ్స్ పై , ఆయన ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటించగా, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రానికి కనీసం 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో నిర్మాత నాగవంశీ ఎదుర్కొన్న ట్రోల్స్ మామూలివి కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ చిత్రం గురించి కాస్త హద్దులు దాటి మరీ మాట్లాడారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను మీ ఇష్టమొచ్చిన బూతులతో తిట్టండి అంటూ తొడగొట్టి మరీ సవాల్ చేశారు నాగవంశీ. అంతే కాకుండా, అదే ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తన రెండు కాలర్లను పైకి ఎత్తి మరీ చూపడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇక నేడు జరిగిన ‘లెనిన్’ మూవీ ప్రెస్ మీట్ లో నాగవంశీ ని ఒక విలేక్షరి ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చా ‘ అని అడగ్గా , అందుకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘కాలర్ ఎత్తడాలు వంటివి ఏమి లేవు , అసలు కాలర్ టాపిక్ తీసుకొని రాకండి’ అంటూ సమాధానం ఇచ్చారు నాగవంశీ.
అంటే ఆయన పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎత్తడం పై సెటైర్లు వేసినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్థమైంది. దీంతో సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగవంశీ పై మండిపడుతున్నారు. తిన్నగా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఈ బలుపు కామెంట్స్ ఏంటి అంటూ నాగవంశీ ని ట్యాగ్ చేసి బూతులు తిడుతున్నారు. మరి దీనిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చి అభిమానులకు క్షమాపణలు చెప్తారో లేదో చూడాలి. ఈ ఏడాది ఆరంభం లో ‘అనగనగా ఒక రాజు’ తో భారీ హిట్ ని అందుకున్న నాగవంశీ , ఆ తర్వాత ‘ఫంకీ ‘ చిత్రం తో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ‘లెనిన్’ తో సూపర్ హిట్ ని అందుకొని మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.
