
తాను బతికి ఉండగానే కాదు తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్లమని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేరాలని అనుకోలేదన్నారు. ఒక వేళ, కాంగ్రెస్ నాయకత్వం తనను పార్టీ వీడాలని కోరితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని, అయితే బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం స్పందించారు.