https://oktelugu.com/

ఈ 11 ఏళ్ల ప్రేమ.. అంతు‘చిక్కని’ ఓ రహస్యం!

నిజంగా ఆ ప్రేమికుడిని మెచ్చుకోవాలి.. 11 ఏళ్లు ఒక గదిలో బాత్రూం లేకున్నా జీవించిన ఆ ప్రియురాలి పిచ్చి ప్రేమకు ఓ తాజ్ మహల్ కట్టాల్సిందే. ఒకటి కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్లు అమ్మాయి ఇంటి ముందే ప్రియుడి ఇంటి వెనుకాల గదిలో తాళం వేసుకొని ప్రియుడి ఆధీనంలో ఉన్న ఈ ప్రేమ కథ చరిత్రలోనే గొప్పది అని చాటిచెప్పొచ్చు. 11 ఏళ్లు ఊళ్లో, అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రియురాలిని తన ఇంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 04:44 PM IST
    Follow us on

    నిజంగా ఆ ప్రేమికుడిని మెచ్చుకోవాలి.. 11 ఏళ్లు ఒక గదిలో బాత్రూం లేకున్నా జీవించిన ఆ ప్రియురాలి పిచ్చి ప్రేమకు ఓ తాజ్ మహల్ కట్టాల్సిందే. ఒకటి కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్లు అమ్మాయి ఇంటి ముందే ప్రియుడి ఇంటి వెనుకాల గదిలో తాళం వేసుకొని ప్రియుడి ఆధీనంలో ఉన్న ఈ ప్రేమ కథ చరిత్రలోనే గొప్పది అని చాటిచెప్పొచ్చు.

    11 ఏళ్లు ఊళ్లో, అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రియురాలిని తన ఇంటి వెనుకాల గదిలో దాచేశాడో యువకుడు. ఆఖరుకు వారి ఇంటి వారికి కూడా ఓ అమ్మాయి ఆ గదిలో ఉన్న విషయం తెలియదు.

    కేరళలోని పాలక్కడ్ జిల్లా అయిరూర్ గ్రామంలో నడిచిన ఈ ప్రేమ కథ నిజంగా అంతు‘చిక్కని’ రహస్యంగా మారింది. 11 ఏళ్ల క్రితం 18 ఏళ్ల యువతి మిస్అ య్యింది. పోలీసులకు కుటుంబ సభ్యులు వెళ్లి కేసు పెట్టినా ఆమె దొరకలేదు. ఆ అమ్మాయి తరుఫు వారు ఆశలు వదిలేశారు.

    అయితే ఆ అమ్మాయి ఇంటి సమీపంలో ఉండే యువకుడిని గాఢంగా ప్రేమించిన యువతి తన కుటుంబ సభ్యులు పెళ్లి చేయరనే యువకుడితో రాత్రికి రాత్రి వారి ఇంటికి వచ్చింది. యువకుడు తన ఇంటి వెనుకాల గదిలో తాళం వేసేసి ఆమెను ఉంచాడు. రాత్రిళ్లు మాత్రమే తెరిచి ఆమెకు ఆహారం, నీరు ఇచ్చేవాడు. కనీసం అటాచ్ బాత్రూం లేని ఆ గదిలో ఉన్న యువతి కిటీకి నుంచి వెళ్లి రాత్రుళ్లే కాలకృత్యాలు తీర్చుకునేది. స్నానం, టాయ్ లెట్ సహా అన్ని రాత్రియే పూర్తి చేసేది. అలా 11 ఏళ్లు జీవించింది.

    ఇటీవల అబ్బాయి కూడా మిస్ అయ్యాడు. అబ్బాయి తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టగా.. ట్రేస్ చేసిన పోలీసులకు ఈ అబ్బాయితో 11 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన యువతి కనిపించింది. ఆరా తీస్తే ఈ రహస్య ప్రేమ కథ బయటపడింది. 11 ఏళ్లు ప్రపంచాన్ని, కుటుంబాన్ని చూడకుండా ఉన్న ఆ యువతి గుండెధైర్యాన్ని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఇది చరిత్రలో ఓ గొప్ప ప్రేమకథగా మిగిలిపోతుందంటే నమ్మండి.