స్టార్ హీరోయిన్ స్నానం కూడా చేయకుండా.. !

‘బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా’కి హీరోయిన్ గా చాలా ఈజీగా ఎంట్రీ దొరికింది. కానీ, పరిణీతి హీరోయిన్ గా నిలబడటానికి చాల కష్ట పడింది. ఓ దశలో ఆమెకు అవకాశాలు రాకపోతే తనకు తానే ఉచితంగా యాడ్ ఫిల్మ్స్ చేసి, తనను తానూ కొత్తగా మలుచుకుని మళ్ళీ హీరోయిన్ గా ఎదిగి, బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా పరిణితి సినిమా కోసం ఏమైనా చేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే, ఎక్స్ పోజింగే […]

Written By: admin, Updated On : June 10, 2021 4:39 pm
Follow us on

‘బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా’కి హీరోయిన్ గా చాలా ఈజీగా ఎంట్రీ దొరికింది. కానీ, పరిణీతి హీరోయిన్ గా నిలబడటానికి చాల కష్ట పడింది. ఓ దశలో ఆమెకు అవకాశాలు రాకపోతే తనకు తానే ఉచితంగా యాడ్ ఫిల్మ్స్ చేసి, తనను తానూ కొత్తగా మలుచుకుని మళ్ళీ హీరోయిన్ గా ఎదిగి, బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ముఖ్యంగా పరిణితి సినిమా కోసం ఏమైనా చేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే, ఎక్స్ పోజింగే కాదు, కఠినమైన పనులు కూడా చేస్తోంది. ఈ క్రమంలో పరిణీతి చోప్రా ఓ పాత్ర కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నానని చెప్పుకొచ్చింది. అర్జున్ కపూర్ తో కలిసి నటించిన సందీప్ ఔర్ పింకీ ప‌రార్ సినిమా కోసం ఈ పని చేసిందట. ఇక ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదల అయింది.

ఇక ఈ సినిమాలో పరిణీతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా పరిణితి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతమైన ఎమోషన్స్ ను పలికించింది. ఫేస్ లో అలాగే కళ్ళల్లో ఆ ఎమోషన్ కనిపించాలని ప్రత్యేకమైన మేకప్ కూడా వేసుకుంది. ఇక కథ ప్రకారం పరిణితి పాత్రకి అనుకోకుండా అబార్షన్ జరుగుతుంది. తల్లి తనానికి దూరమైన ఓ తల్లి పడే బాధ ఎలివేట్ అవ్వాలి.

పైగా కొన్ని రోజులు పాటు అదే షాక్ లో ఉండాలి. ఈ సందర్భాన్ని దర్శకుడు అత్యంత సహజంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పరిణితి ఫుడ్ కూడా తీసుకోకుండా అలాగే స్నానం కూడా చేయకుండా నటించింది. ఆమె కష్టానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆమె నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సీన్స్ ను ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గుడిసెలో మూడు రోజులు షూట్ చేశారట. సీన్స్ కూడా చాల సహజంగా వచ్చాయి.