CM Chandrababu: అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన స్వర్ణ్ంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సేవారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం సేవారంగం నుంచి 6.3 శాతం ఆదాయమే వస్తుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.