Kerala: సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఎంవీ వాన్ హై 503 కేరళ తీరానికి సమీపంలోకి చేరుకున్న సమయంలో దాని లోపల పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన నౌకదళం ఐఎన్ఎస్ సూరత్ ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించింది. దీంతో పాటు నేవల్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ్ నుంచి డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో సార్టీలు చేపట్టింది.