హైదరాబాద్ కు రాఘురామ తరలింపు
గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు ఎంపీ రఘురామను తరలించారు. రఘురామకు పోలీస్ ఎస్కార్డ్ తో పాటు సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనను పోలీసులు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యూడీషియల్ ఆఫిసర్ ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది. రఘురామ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు […]
Written By:
, Updated On : May 17, 2021 / 08:06 PM IST

గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు ఎంపీ రఘురామను తరలించారు. రఘురామకు పోలీస్ ఎస్కార్డ్ తో పాటు సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనను పోలీసులు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యూడీషియల్ ఆఫిసర్ ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది. రఘురామ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.