Homeజాతీయం - అంతర్జాతీయంతౌక్టే తుఫాన్ ఎఫెక్ట్.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక

తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్టాటక, కేరళ రాష్ట్రాల తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం తౌక్టే తుఫాన్ పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కి. మీ వేగంతో ప్రయనిస్తున్నది. ఈ రాత్రికి గుజరాత్ లోని పోరుబందర్ – మహూవా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273 మంది ఉన్నట్లు సమాచారం. కొట్టుకుపోయిన నౌక కోసం ఇండియన్ నేవీ గాలింపు చర్యలు చేపట్టింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version