RahulvsModi
దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నా కూడా ప్రధాని మోడీ మొండి పట్టుదలతో వెళుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేట్లకు మేలు చేసేలా.. రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేసేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ లో తాజాగా బీజేపీ సర్కార్ ఆమోదింపచేసుకుంది.. దేశంలో ఎక్కడికైనా వెళ్లి అమ్మడం, కొనుగోలు చేసే ఈ అనైతిక బిల్లులపై పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఈ దేశం ఎన్నిటికీ సఫలం కానీయదు అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.
Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం
కొత్త బిల్లులో రైతులకు కనీస మద్దతు ధరపై గ్యారెంటీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీని రైతు విరోధిగా అభివర్ణించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు.
దేశవాప్తంగా రైతులు, సంఘాలు, విపక్షాలు వ్యతిరేకిస్తున్న కేంద్రం తన పంతం నెగ్గించుకోవడంపై పార్లమెంట్ లో విపక్షాలు పెద్ద యుద్ధమే చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై నిప్పులు కురిపించారు.
Also Read: టిక్ టాక్ కు ఊరట.. నిషేధం ఎత్తేసిన ట్రంప్
కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులకు తాజాగా ఆమోదం లభించింది. విపక్షాలు ఎంత పోరాడినా.. నిరసన తెలిపినా.. రాజ్యసభ అట్టుడికినా కూడా బీజేపీ తన పంతం నెగ్గించుకోవడం గమనార్హం.