https://oktelugu.com/

లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ !

బిగ్‌ బాస్ షోలో జరిగే రచ్చ గురించి చెప్పడానికి డైలీ క్రిమినల్ సీరియల్ కూడా సరిపోదేమో. అయితే షో నడిచేదే ఎమోషన్స్ మీద. కాస్త కోపం ఎక్కువై ఏది పడితే అది మాట్లాడితే.. బ్యాడ్ అవ్వాల్సి వస్తోంది. అందుకే మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అలాగే ఏ పని చేసినా అన్ని రకాలుగా ఆలోచించుకుని చేయాలి. తొందరపడి మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. గతంలో అలా మాటలు తూలే, భాను శ్రీ, తేజస్వీ, […]

Written By:
  • admin
  • , Updated On : September 20, 2020 / 03:39 PM IST
    Follow us on


    బిగ్‌ బాస్ షోలో జరిగే రచ్చ గురించి చెప్పడానికి డైలీ క్రిమినల్ సీరియల్ కూడా సరిపోదేమో. అయితే షో నడిచేదే ఎమోషన్స్ మీద. కాస్త కోపం ఎక్కువై ఏది పడితే అది మాట్లాడితే.. బ్యాడ్ అవ్వాల్సి వస్తోంది. అందుకే మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అలాగే ఏ పని చేసినా అన్ని రకాలుగా ఆలోచించుకుని చేయాలి. తొందరపడి మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. గతంలో అలా మాటలు తూలే, భాను శ్రీ, తేజస్వీ, దీప్తి సునయన, తమన్నా సింహాద్రి, హేమ ఇలా కొందరు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ సీజన్ లో కూడా మాటలు తూలి ఎలిమినేటి అయ్యేలా ఉంది యాంకర్ లాస్య. శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ అమ్మ రాజశేఖర్‌ పై లాస్య చేసిన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !

    మొత్తానికి హౌస్‌మేట్స్ అందరూ సింపతీ కోసం, అలాగే ఎవరికీ వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని కింగ్ నాగార్జున కూడా ఫైర్ అయ్యాడు. హౌస్‌మేట్స్ గుట్టు రట్టుచేసేందుకు హౌస్‌మేట్స్ లో హీరో ఎవరు, జీరో ఎవరు అనే టాస్క్ ఇచ్చి మొత్తానికి హౌస్‌మేట్స్ మధ్య అగ్గి రాజేశాడు. ప్రతీ కంటెస్టెంట్ తమ దృష్టిలో హీరో ఎవరు, జీరో ఎవరు అని చెప్పాలనే సరికి హౌస్‌మేట్స్ కూడా సేఫ్ గేమ్ ఆడటానికి వీలు లేకుండా పోయింది. పైగా హీరో లేదా జీరో అని అలా ఎందుకు చెప్పారో కూడా కారణాలు చెప్పాలని నాగ్ షరతు పెట్టాడు. దాంతో ఎవరికీ వారు తమ తమ దృష్టిలో హీరోలు, జీరోలుగా ఉన్నవారి పై తమ అభిప్రాయాలను చెప్పారు. ఆ క్రమంలోనే యాంకర్ లాస్య కాస్త అతి చేసి.. ఫైనల్ గా ట్రోల్ చేసుకోవడానికి నెటిజన్లకు అవకాశం ఇచ్చేసింది.

    లాస్య తన దృష్టిలో అమ్మ రాజశేఖర్‌ ను జీరో అని తెలిపింది. శృతి మించిన కామెడీ తాను ఒప్పుకోలేనని, స్కిట్‌లో భాగంగా దివి విషయంలో ఆయన కామెడీ చేసిన విధానం తనకు నచ్చలేదని లాస్యగారు సగర్వంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి అమ్మ రాజశేఖర్‌ ను హార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. లాస్య ఆరోపణలతో మాస్టర్ కూడా చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అవ్వడం, దీంతో లాస్య పై దివి రివర్స్ అటాక్ ఇవ్వడం.. ఆ రకంగా ప్రేక్షకుల దృష్టిలో లాస్య సగటు నిందితురాలిగా బిక్కమొహం పెట్టాల్సి వచ్చింది.

    Also Read: షూటింగుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్?

    అయితే తాజాగా లాస్య విషయంపై సింగర్ గీతా మాధురి స్పందిస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పొరపాట్లు చేస్తే కంటెస్టెంట్స్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుంది. లాస్య కూడా కాస్త అనాలోచితంగా మాస్టర్ పై ఆరోపణలు చేసింది అని కౌంటర్ వేసింది. అయితే మళ్లీ ఈ పోస్ట్‌ను గీతా మాధురి డిలీట్ చేసింది. ఇంతకు గీతా మాధురి ఎందుకు పోస్ట్ చేసింది.. ఎందుకు డిలేట్ చేసిందో ఆమెకే తెలియాలి.