https://oktelugu.com/

టిక్ టాక్ కు ఊరట.. నిషేధం ఎత్తేసిన ట్రంప్

చైనాకు చెందిన టిక్ టాక్ కంపెనీ కొన్నినెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్-చైనా ఘర్షణ చివరికీ టిక్ టాక్ మెడకు చుట్టుకుంది. గాల్వానా లోయలో చైనా దురాక్రమణకు నిరసనగా భారత్ ధీటుగా స్పందించింది. దీనిలో భాగంగా భారత్ లో చైనాకు చెందిన పలు కాంట్రాక్టులు, 59 యాప్స్ నిషేధించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. Also Read: అనూహ్యంగా మలుపుతిరిగిన అమెరికా ఎన్నికలు భారత్ టిక్ టిక్ యాప్ నిషేధించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 03:24 PM IST

    Tik Tok

    Follow us on

    చైనాకు చెందిన టిక్ టాక్ కంపెనీ కొన్నినెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్-చైనా ఘర్షణ చివరికీ టిక్ టాక్ మెడకు చుట్టుకుంది. గాల్వానా లోయలో చైనా దురాక్రమణకు నిరసనగా భారత్ ధీటుగా స్పందించింది. దీనిలో భాగంగా భారత్ లో చైనాకు చెందిన పలు కాంట్రాక్టులు, 59 యాప్స్ నిషేధించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది.

    Also Read: అనూహ్యంగా మలుపుతిరిగిన అమెరికా ఎన్నికలు

    భారత్ టిక్ టిక్ యాప్ నిషేధించిన తర్వాత పలు దేశాలు అదేబాటలో నడిచాయి. టిక్ టాక్ ను భారత్ నిషేధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్వాగతించారు. టిక్ టాక్ వల్ల అమెరికా పౌరుల భద్రతకు ప్రమాదం ఉంచి ఉందనే కారణంతో అమెరికాలో  కూడా ఇటీవల నిషేధించారు.  అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అంటూ టిక్ టాక్ పై నిషేధాన్ని ఇటీవల ట్రంప్ సర్కార్ ప్రకటించింది.

    అయితే తాజాగా టిక్ టాక్ అమెరికాలోని ఒరాకిల్, వాల్ మార్ట్ లతో ఒప్పందం చేసుకొని అధికార బాధ్యతలు బదిలీ చేసుకోవడంతో అధ్యక్షుడు ట్రంప్ శాంతించారు. టిక్ టాక్ కోసం ఒరాకిల్, వాల్ మార్ట్ కలిసి ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని.. టిక్ టాక్ గ్లోబల్ పేరిట దేశంలో ఇవి ఆపరేషన్స్ చేస్తాయని ట్రంప్ మీడియాకు తెలిపారు. అమెరికన్ పౌరుల డేటాను రక్షించే సెక్యూరిటీ బాధ్యత ఒరాకిల్ సంస్థదేనని అమెరికా ట్రెజరీ శాఖ స్పష్టం చేసింది. ఈ టిక్ టాక్ గ్లోబల్ లో అమెరికా షేర్ హోల్డర్లు 53శాతం, చైనీస్ ఇన్వెస్టర్లు 36శాతం వాటాను కలిగి ఉంటారు. టిక్ టాక్ పై ఒరాకిల్, వాల్ మార్ట్ రెండూ పూర్తిగా ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయని అందుకే దేశంలో అనుమతిస్తున్నామని ట్రంప్ తెలిపారు.

    Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం

    అమెరికాలో తాజాగా టిక్ టాక్ కార్యకలాపాలకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో అమెరికన్ సంస్థలైన ఒరాకిల్, వాల్ మార్ట్ ఒప్పందానికి తాను అంగీకరిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.

    కాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ హర్షం వ్యక్తం చేసింది. తాము అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తామని తెలిపింది.. ఆ దేశ భద్రతకు ముప్పును తేబోమని టిక్ టాక్ హామీ ఇచ్చింది.