సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం కీలక భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల విద్యాశాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. ఆ వివరాలను పరీక్షల నిర్వహణకు ఉన్న అవకాశాలను అధికారులు మోదీకి వివరించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వమించాలని భావిస్తున్న కేంద్రం ఇటీవల ఈ విషయమై అన్ని రాష్ట్రాలతో చర్చించింది.