ఈటల, పవన్ కల్యాణ్ సమన్వయం కుదిరేనా?

తెలంగాణలో బీజేపీ ప్రతిష్ట ఇనుమడింపజేయడానికి పావులు కదుపుతోంది. ఈటల రాజేందర్ చేరికతో పార్టీ భవితవ్యాన్ని మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఈటలకు పవన్ కల్యాణ్ ను జతచేసి తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చురుకుగా నడిపించేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి గతంలో జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో దక్కిన విజయాలతో పార్టీకి ఊపు తీసుకురావాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. […]

Written By: Srinivas, Updated On : June 1, 2021 4:47 pm
Follow us on

తెలంగాణలో బీజేపీ ప్రతిష్ట ఇనుమడింపజేయడానికి పావులు కదుపుతోంది. ఈటల రాజేందర్ చేరికతో పార్టీ భవితవ్యాన్ని మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఈటలకు పవన్ కల్యాణ్ ను జతచేసి తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చురుకుగా నడిపించేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి గతంలో జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో దక్కిన విజయాలతో పార్టీకి ఊపు తీసుకురావాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.

టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆయన రాకతో బీజేపీ బలం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. అయితే బీజేపీ నేతలు అంత త్వరగా ఈటలతో కలిసిపోతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీలో ఈటల స్థానమేంటి? నెంబర్ 2నా, నెంబర్ 3నా అనే మీమాంస అందరిలో నెలకొంది.

నిన్నమొన్నటి వరకు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలందర్ని దుర్భాషలాడిన ఈటల ఒక్కసారిగా వారితో చెట్టాపట్టాలేసుకుని తిరగాలంటే సాధ్యం కాకపోవచ్చు. వారితో జతకట్టి కేసీఆర్, టీఆర్ఎస్ ని తిట్టడం వీలు కాకపోవచ్చు. దీంతో పవన్ కల్యాణ్ ను తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న విషయం నేతల్లో మొదలైంది. పవన్-ఈటల కాంబినేషన్ తో తెలంగాణ భవిష్యత్తు మారనుందా అని ఎదురుచూస్తున్నారు.

బీజేపీ నాయకత్వం ప్రతిపాదిస్తే పవన్ ఒప్పుకుంటారా? తెలంగాణ విషయానికొస్తే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? కేసీఆర్, కేటీఆర్ ను పొగిడిన సందర్భాలున్నాయి. ఇలాంట సందర్భంలో పవన్, ఈటల కలిసి రాజకీయం చేస్తారా అనేది వేచి చూడాలి. పవన్ కల్యాణ్ అంచనాలు ఎవరికీ అందవు. కేంద్ర నాయకత్వం కనుసైగ చేస్తే రాజకీయాలు చేయడానికి సిద్ధపడతారా అనేదే ప్రశ్న.