
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితులపై చర్చించారు. తమ రాష్ట్రాల్లో తాము చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రులు వివరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బీ ఎస్ యడియూరప్ప, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కు మోదీ ఫోన్ చేశారు.