ఏమిటయ్యా ఈ ఖర్మ.. పల్లెటూరి ఆడపడుచులు కూడా !

కాలానికి తగ్గట్టు మనుషుల వస్త్రధారణ మారిపోవడం సహజం, కాకపోతే ఆ సహజం పేరుతో హద్దులు మీరి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు కొందరు నటీమణులు. ఒకప్పుడు సీరియల్స్ లో పద్దతిగా కనిపించేవారు. ఇప్పుడు టీవీ సీరియల్స్ లోనూ ముద్దుల సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఎంత గ్లామర్ ఫీల్డ్ అయితే మాత్రం, టీవీ నటీమణులు కూడా ఐటమ్ సాంగ్స్ చేసే వ్యాంప్ బ్యూటీలకు పోటీ ఇచ్చేలా తయారైతే ఎలా ? నిజానికి సినిమా ఇండస్ట్రీలో అప్పటి హీరోయిన్ల దగ్గర నుండి ఇప్పటి […]

Written By: NARESH, Updated On : May 9, 2021 2:05 pm
Follow us on


కాలానికి తగ్గట్టు మనుషుల వస్త్రధారణ మారిపోవడం సహజం, కాకపోతే ఆ సహజం పేరుతో హద్దులు మీరి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు కొందరు నటీమణులు. ఒకప్పుడు సీరియల్స్ లో పద్దతిగా కనిపించేవారు. ఇప్పుడు టీవీ సీరియల్స్ లోనూ ముద్దుల సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఎంత గ్లామర్ ఫీల్డ్ అయితే మాత్రం, టీవీ నటీమణులు కూడా ఐటమ్ సాంగ్స్ చేసే వ్యాంప్ బ్యూటీలకు పోటీ ఇచ్చేలా తయారైతే ఎలా ?

నిజానికి సినిమా ఇండస్ట్రీలో అప్పటి హీరోయిన్ల దగ్గర నుండి ఇప్పటి హాట్ బ్యూటీల వరకూ వారి వస్త్రధారణ ఎప్పుడూ హాట్ టాపికే. సినిమాల వరకే ఇన్నాళ్లు ఇది పరిమితం అయ్యేది. కానీ, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్త్రధారణ విషయంలో పరిధులు లేకుండా పోతున్నాయి. అందరూ కాకపోయినా చాలామంది సీరియల్ భామలు ఈ మధ్య హాటుగా కనిపించడానికి తెగ ఉత్సాహపడుతున్నారు.

అసలు ఎక్స్ పోజింగ్ అనేది వారి దృష్టిలో అతి సర్వ సాధారణమైన విషయం అన్నట్టుగా మారింది వారి ఆలోచనా వ్యవహారం. సినిమాల్లో పాత్రను బట్టి కొంత గ్లామర్ షో ఎలాగూ తప్పదు కాబట్టి, సినిమా వాళ్ళను ఏమి అనలేం, కానీ సీరియల్స్ లో ఎక్స్ పోజింగ్ ఎందుకు ? సీరియల్స్ లో లిప్ కిస్ లు ఎంతవరకు అవసరం ? సీరియల్స్ చూసి నిజ జీవితంలో అలా కనిపించాలని పల్లెటూరి ఆడపడుచులు కూడా ఆశ పడుతున్నారంటే ఎవర్నీ తప్పు పట్టాలి ?

ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లిన అక్కడ ఆడవాళ్ళ పై సీరియల్స్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మహిళలు అయితే, తమ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను సీరియల్స్ లోని సంఘటనలకు అనువదించుకుని ముందుకు పోతున్నారు. ఇక సీరియల్స్ లో నటీమణుల వస్త్రధారణ, వారి పాత్రల చిత్రీకరణను చూసి ఏమిటయ్యా మనకు ఈ ఖర్మ అని అనిపిస్తోంది.

మొత్తమ్మీద సీరియల్స్ లో నటీమణుల నడక వారి పద్దతి చూసి, తాము కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తున్నాం అన్నట్లుగా ఊహించుకుని మరీ రెడీ అవుతున్నారు పల్లెటూరి మహిళలు. కాబట్టి, సీరియల్స్ లో అనవసరపు హాట్ నెస్ ను, వైల్డ్ ఎమోషన్స్ ను తగ్గిస్తే మంచిది.