
దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన గుజరాత్ లోని గాంధీనగర్ క్యాపిటల్ రైల్వేస్టేషన్ ను ప్రధానమంత్రి మోదీ శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ స్టేషన్ నుంచి ప్రతివారం వారణాసికి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను కూడా మోదీ జెండా ఊపీ ప్రారంభించారు. స్టేషన్ పైభాగంలో రూ. 790 కోట్లతో నిర్మించిన ఫైవ్ స్టార్ హోటన్ ను కూడా లాంభనంగా ఆరంభించారు. తన సొంతపట్టణం వాడ్ నగర్ నుంచి కలిపే గాంధీనగర్-వరెథా ఎంఈఎంయూ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు.