తెలంగాణలోని ప్రతిపక్షాల ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం హ్యాక్ చేస్తోందా? తాజాగా రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ హ్యాకింగ్ తోనే గత పాలనలో కేసీఆర్ సర్కార్ ‘నాటి ఏపీ సీఎం చంద్రబాబును ఇరికించి అమరావతికి సాగనంపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఇరికించి గట్టి దెబ్బ తీసింది. అదో వివాదాస్పదం కూడా అయ్యింది.
అయితే తాజాగా ఆ ఫోన్ల ట్యాపింగ్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ కొనసాగిస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. పోలీసులు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స ఐజీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఐజీ ప్రభాకర్ రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. దీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
ప్రధాని మోడీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ పేర్కొన్నారు.
రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. తెలంగాణ సర్కార్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మరోసారి కలకలం రేపారు. మరి చంద్రబాబు విషయంలో జరిగినట్టు ఇప్పటికీ జరుగుతుందా లేదా? అన్నది నిగ్గుతేలాలని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.