కోవిడ్ ను మోదీ సరిగా అర్థం చేసుకోలేదు.. రాహుల్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ కానీ, కేంద్రం కానీ కోవిడ్ సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోయిందని అన్నారు. శుక్రవారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ మాట్లాడుతూ, కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని, విస్తరిస్తున్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యుఘంటికలు మోగిస్తుందని అన్నారు. వ్యాక్సిన్స్ వ్యూహాన్ని కేంద్ర సరిగా అమలు చేయకుంటే […]
Written By:
, Updated On : May 28, 2021 / 02:45 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ కానీ, కేంద్రం కానీ కోవిడ్ సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోయిందని అన్నారు. శుక్రవారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ మాట్లాడుతూ, కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని, విస్తరిస్తున్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యుఘంటికలు మోగిస్తుందని అన్నారు. వ్యాక్సిన్స్ వ్యూహాన్ని కేంద్ర సరిగా అమలు చేయకుంటే ఇండియా అనేక కోవిడ్ వేవ్ లను చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.