
ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయనకు అండగా నిలిచారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కందికొండ చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రూ. 2 లక్షల 50 వేలు అందేలా చేశారు. అలాగే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు.