
మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, ఎస్పీవై. సాయి శేఖర్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలతో కలిసి కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించారు. కేసులు నమోదైన అంశాలే పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయని కోలుకున్న వారి వివరాలు ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు.