
కరోనా పోరులో తొలి టీకాగా పేరున్న రష్యన్ స్పుత్నిక్ వీ మరో వారంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దేశంలోకి వ్యాక్సిన్ నిల్వలు చేరుకున్నాయని మరో వారంలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకా వినియోగానికి భారత్ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యాక్సిన్ వయల్స్ ను లక్షల్లో భారత్ దిగుమతి చేసుకుంటోంది.