
ఒలింపిక్స్ లో 100 మీటర్ల రేసు అంటే బోల్ట్ దే గోల్డో మెడల్ అని ఫిక్సయి పోయి చేసేవారు. కానీ ఈసారి అతడు లేకుండా జరిగిన ఈ రేసులో ఓ కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటలీకి చెందిన లామంట్ మార్సెల్ జాకబ్స్ 9.8 సెకన్లలో రేసు పూర్తి చేసి ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇది యురోపియన్ రికార్డు కావడం విశేషం. ఇక అమెరికాకు చెందిన ఫ్రెడ్ కెర్లీ 9.84 సెకన్లతో రెండోస్థానంలో, కెనడానకు చెందిన ఆండ్రీ డి గ్రాస్ 9.89 సెకన్లలో మూడో స్థానంలో నిలిచారు.